శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 7 అక్టోబరు 2018 (12:36 IST)

గీత గోవిందం షూటింగ్‌లో ఏడ్చేశాను.. ఎందుకో తెలుసా?: రష్మిక

గీత గోవిందం హీరోయిన్ రష్మిక.. ఆ సినిమా షూటింగ్ జరిగే సెట్‌లో ఏడ్చేసిందట. మొత్తం యూనిట్ ఆమెను ఏడ్పించిందట.

గీత గోవిందం హీరోయిన్ రష్మిక.. ఆ సినిమా షూటింగ్ జరిగే సెట్‌లో ఏడ్చేసిందట. మొత్తం యూనిట్ ఆమెను ఏడ్పించిందట. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓసారి ఓసారి గీతగోవిందం షూటింగ్ స్పాట్‌కు రష్మిక వెళ్లడం లేటయ్యే సరికి.. సెట్లో వున్న ఎవ్వరూ ఆమెతో మాట్లాడలేదట.


అంతేకాదు.. పలకరించినా పలకకపోవడంతో రష్మిక ఏడ్చేసిందట. వెంటనే దర్శకుడు పరశురామ్ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చి.. ఆటపట్టించేందుకే ఇదంతా చేశామని చెప్పారట.. అప్పుడే రష్మిక హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుందట. 
 
అప్పటివరకు తనను ఫాలో అవుతున్న కెమేరాను కూడా పరుశురామ్ చూపించారని రష్మిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను అల్లరి పిల్లనే అయినా.. చాలా సున్నితమైన వ్యక్తినని రష్మిక తెలిపింది. 
 
ఎవరైనా ముభావంగా వుంటే.. వారు తన వల్ల బాధపడుతున్నారా అని హైరానా పడిపోతానని తెలిపింది. గీత గోవిందం తర్వాత దేవదాస్ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతున్న నేపథ్యంలో రష్మిక పలు అంశాలపై చర్చించింది.

తనకు పుస్తకాలు ముట్టుకుంటే నిద్రొచ్చేస్తుందని చెప్పింది. సినిమా పాటలు మాత్రం బాగా వింటానని రష్మిక తెలిపింది. వంట చేయడం కూడా కొంచెం తెలుసనని, కేక్ బాగా చేస్తానని రష్మిక వెల్లడించింది.