1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rashmika Mandanna speech at DevaDas Promotion event

సినిమా ప్రమోషన్స్‌లో వ్యక్తిగత విషయాలు అవసరమా బ్రో : రష్మిక మందన్న

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటించిన మల్టీస్టారర్ మూవీ "దేవదాస్". ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

Rashmika Mandanna
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటించిన మల్టీస్టారర్ మూవీ "దేవదాస్". ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందన్న పాల్గొంది. అపుడు ఓ విలేకరి ఆమె వ్యక్తిగత విషయాలపై ప్రశ్న సంధించాడు. దీనిపై ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ, ఘాటుగానే సమాధానమిచ్చింది.
 
కన్నడ హీరో, నిర్మాత రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థం రద్దుకుగల కారణాలపై అడిగిన ప్రస్నకు రష్మిక బదులిస్తూ, 'ఈ విషయం గురించి మీరు రెండు నెలల ముందుగనుక అడిగుంటే 'అయ్యో.. అలాంటిదేమీ లేదని చెప్పేదాన్ని'. కానీ ఇప్పుడు మాత్రం నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడను. ఒకవేళ అలాంటివి చెప్పాల్సి వస్తే సోషల్ మీడియా వేదికగా చెబుతాను. అంతేకానీ సినిమా ప్రమోషన్స్‌లో ఇలాంటివి ఎందుకు? బ్రో' అంటూ సమాధానమిచ్చారు. 
 
కాగా, శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వినీద‌త్ నిర్మించిన 'దేవదాస్' చిత్రంలో నాగార్జున, నాని హీరోలుగా నటించగా ఆకాంక్ష సింగ్‌, ర‌ష్మిక మందన్న హీరోయిన్లుగా నటించారు. ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అది ప్రేమ కాదు.. ఈగో.. కసి.. నాదన్న పొగరు : ప్రణయ్ హత్యపై హీరో మంచు మనోజ్