శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (10:35 IST)

ప్లీజ్.. మీకు దణ్ణం పెడతా... నా పని నన్ను చేసుకోనివ్వండి..

తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన్న. ఈమె 'ఛలో', 'కిరాక్ పార్టీ', 'గీత గోవిందం' చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ హీరోయిన్.. కన్నడ నిర్మాత, నటుడు రక్షిత్‌శెట్టితో

తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన్న. ఈమె 'ఛలో', 'కిరాక్ పార్టీ', 'గీత గోవిందం' చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ హీరోయిన్.. కన్నడ నిర్మాత, నటుడు రక్షిత్‌శెట్టితో గతేడాది నిశ్చితార్ధం చేసుకుంది. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న వీరి నిశ్చితార్ధం రద్దు అయింది. ఈ నేప‌థ్యంలో ర‌ష్మిక త‌ల్లి నిశ్చితార్దం రద్దైందని చెబుతూ, రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. తాము కొంత ఇబ్బందికి లోనయ్యామని, ప్రస్తుతం దాని నుంచి కోలుకుంటున్నామని వివరణ కూడా ఇచ్చారు.
 
ఈ నేపథ్యంలో కొన్నాళ్ళుగా ర‌ష్మిక‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. వీటిపై స్పందించని రష్మిక... తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చింది. 'కొంతకాలంగా నేను సైలెంట్‌గా ఉన్నందుకు క్ష‌మించండి. నాపై వ‌స్తున్న స్టోరీస్‌, ఆర్టిక‌ల్స్‌, ట్రోల్స్ చూస్తూ ఉన్నాను. బ‌య‌ట నేను ఎలా బ్లేమ్ అవుతున్నానే విష‌యం నా దృష్టికి వ‌చ్చింది. దీనికి నేను ఎవ‌రిని నిందించ‌డం లేదు. 
 
అందుకు కారణం మీరు విన్న‌ది నిజం కాదు అని చెప్పేందుకు ఎవ‌రు నా త‌ర‌పున ముందుకు రాలేదు. ఒక విష‌యం చెప్పాల‌నుకున్నా. నేను, ర‌క్షిత్ లేదంటే మ‌రెవ‌రైన ఇండ‌స్ట్రీలో ఇలాంటి వాటిని భ‌రించ‌లేరు. ప్ర‌తి నాణానికి రెండు సైడ్స్ ఎలా ఉంటాయో, ప్ర‌తి క‌థ‌కు రెండు కార‌ణాలుంటాయి. ఇండ‌స్ట్రీలో మేం చేసే ప‌నుల‌ని ప్ర‌శాంతంగా చేసుకోనివ్వ‌డం. క‌న్న‌డ‌, తెలుగు రెండు భాష‌లో న‌టిస్తాను. మంచి వినోదం అందించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాను' అని రష్మిక తన ట్వీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.