మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:10 IST)

రికార్డు అంటే ఇదీ... రజినీనా మజాకా...

సూపర్ స్టార్ రజినీకాంత్, ఎస్. శంకర్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం 2.O. ఈ చిత్రం మూవీ టీజర్ రెండు రోజుల క్రితం విడుదలైంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి ఏ

సూపర్ స్టార్ రజినీకాంత్, ఎస్. శంకర్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం 2.O. ఈ చిత్రం మూవీ టీజర్ రెండు రోజుల క్రితం విడుదలైంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
 
రోబో సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. అయితే ఈ టీజర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే అరుదైన రికార్డు సాధించింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడులైన ఈ టీజర్ 9 గంటల్లోనే 1.5 కోట్ల వ్యూస్‌ని రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. 
 
ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. తమిళంలో 5.9 మిలియన్లు, తెలుగులో 3.7 మిలియన్లు, హిందీలో 5.1 మిలియన్లు, మొత్తం కలిసి 14.7 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు తెలిపింది.