పెళ్లి కోసం ఇటలీకి వెళ్తూ.. కెమెరాకు చిక్కిన ఆ ఇద్దరు?
బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ వివాహం ఈ నెల 14, 15 తేదీల్లో జరుగనుంది. ఇటలీలోని లేక్ కోమోలో వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరుగనుంది. ఇంకా వీరి పెళ్లికి నాలుగు రోజులే వుండగా.. ఈ జంట ఇటలీకి ప్రయాణమైంది. శనివారం దీపికా, రణ్‌వీర్ సింగ్ విడివిడిగా తెల్లని దుస్తుల్లో ముంబైలోని విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఉన్నట్టుండి.. దీపిక, రణవీర్‌లు ఎయిర్ పోర్ట్‌లో కనిపించడంతో అభిమానులు వారి చుట్టు గుమికూడారు. తమ కెమెరాల్లో దీపిక, రణవీర్‌లను బంధించే ప్రయత్నం చేశారు. దీపిక, రణవీర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాలాకాలంగా ప్రేమలో వున్న ఈ జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతోన్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌తో పాటు వారి ఫ్యామిలీ, స్నేహితులు కూడా ఇటలీకి బయల్దేరారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.