మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (13:12 IST)

దీపికా - రణ్‌వీర్ వివాహ షెడ్యూల్ ఇదేనా?

బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌లు త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. వీరిద్దరూ వచ్చే నెల 14, 15 తేదీల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా వెల్లడించారు. 
 
అయితే వీరి వివాహం ఎక్క‌డ జ‌ర‌గ‌నుంది అనే దానిపై ప్ర‌స్తుతం జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో ర‌ణ్‌వీర్, దీపికాల వెడ్డింగ్ షెడ్యూల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇట‌లీలోని లేక్ కోమోలో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, 200 మంది అతిథుల‌ని మాత్ర‌మే పెళ్లికి ఆహ్వానించ‌నున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
ఈ వివాహ వేడుకలో భాగంగా, నవంబరు 13వ తేదీన సంగీత్, 14వ తేదీన దక్షిణ భారతీయ సంప్రదాయంలోనూ, 15వ తేదీన ఉత్తర భారతీయ సంప్రదాయంలో పెళ్లి వేడుక జరుగనుంది. డిసెంబర్ 11వ తేదీన ముంబైలోని గ్రాండ్ హయత్‌లో అతిపెద్ద రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ షెడ్యూల్‌లో నిజమెంతో తెలియాల్సి ఉంది.