శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 12 అక్టోబరు 2018 (11:44 IST)

బిగ్‌బాస్ జంట నిశ్చితార్థం.. వైరల్‌గా మారిన ప్రీవెడ్డింగ్ ఫోటోలు

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో మంచి ప్రజాధారణ పొందింది. ఈ కార్యక్రమానికి అన్ని భాషల్లోనూ ఇదే తరహా ఆదరణ లభిస్తోంది. అయితే, హిందీ బిగ్‌బాస్ మాత్రం ఇందుకు ప్రత్యేకం. ఈ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ (కంటెస్టెంట్స్) నిజంగానే ప్రేమలో పడిపోతున్నారు.
 
అలా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమలో పడిన ఓ జంట ఇపుడు నిజజీవితంలో ఒక్కటికానున్నారు. వారు ఎవరో కాదు ప్రిన్స్ నరులా, యువికా చౌదరి. వీరిద్దరూ హిందీ ఛానల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ 9వ సీజన్‌లో కంటెస్టంట్లు. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమలో పడ్డారు.
 
ఈ జంట తమ నిశ్చితార్థం విషయాన్ని గత జనవరిలో అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ జంట శుక్రవారం రోజు ఓ ఇంటివారు కానున్నారు. ప్రిన్స్, యువికా తమ పెళ్లి వేడుకకు ఇప్పటికే గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకున్నారు.
 
నిజానికి ఈ కొత్త జంట బుధవారం మెహిందీ వేడుకలు జరుపుకుంది. యువికా చౌదరి నియోన్ గ్రీన్ లెహెంగా, పూలతో డిజైన్ చేసిన ఆభరణాలు ధరించి స్టన్నింగ్ లుక్‌తో అదరగొట్టింది.
 
ప్రిన్స్ నరులా సాంప్రదాయ కుర్తా ఫైజామాతో మెరిసిపోయాడు. ఇద్దరూ కలిసి కొన్ని పాటలకు డ్యాన్స్ కూడా చేశారు. యువికా చౌదరి, ప్రిన్స్ నరులా ప్రీవెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.