సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 18 అక్టోబరు 2018 (13:29 IST)

జోధ్‌పూర్ వేదికగా ప్రియాంకా - నిక్ జోనస్ వివాహం

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్‌లు త్వరలో మూడుముళ్ళ బంధంతో ఒక్కటికానున్నారు. ఇప్పటికే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోగా, త్వరలోనే వీరిద్దరి వివాహాన్ని వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ వివాహాన్ని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను పెళ్లి వేదికగా నిర్ణయించారు. నవంబర్ మాసంలో అక్కడి చారిత్రక ఉమేద్‌భవన్‌లో వివాహం జరగనుంది. ఇటీవలే ప్రియాంకచోప్రా, నిక్‌జోనస్ జోధ్‌పూర్‌ను సందర్శించి వివాహ ఏర్పాట్ల గురించి చర్చించారు. పెళ్లికి ఇరు కుటుంబానికి సంబంధించిన రెండొందల మంది అతిథుల్ని మాత్రమే ఆహ్వానిస్తారని సమాచారం. వివాహానంతరం హాలీవుడ్ సెలబ్రిటీస్ కోసం న్యూయార్క్‌లో గ్రాండ్ రిసెప్షన్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
 
బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబైలో విందు ఏర్పాటు చేస్తారని సమాచారం. హాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన అనంతరం ప్రియాంకచోప్రా గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపును సంపాదించుకుంది. దాంతో ఈ సుందరి పెళ్లి వేడుక కోసం విదేశీ మీడియా సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నేపథ్యంలో చారిత్రక నగరం జోధ్‌పూర్‌లో పెళ్లి వేదికను ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ ద్వితీయార్థంలో పెళ్లికి తేదిని నిర్ణయించారని తెలుస్తున్నది.