సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (16:56 IST)

ప్రియాంకా స్థానంలో భూమి పడ్నేకర్

బాలీవుడు నటి ప్రియాంకా స్థానంలో మరో నటి భూమి పడ్నేకర్‌ను ఎంపికైంది. వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా షారూక్ ఖాన్ నటిస్తున్నారు. మహేశ్ మతై దర్శకత్వం వహిస్తున్

బాలీవుడు నటి ప్రియాంకా స్థానంలో మరో నటి భూమి పడ్నేకర్‌ను ఎంపికైంది. వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా షారూక్ ఖాన్ నటిస్తున్నారు. మహేశ్ మతై దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంకా చోప్రాను హీరోయిన్‌గా ఎంచుకోవాలని తొలుత భావించారు. కానీ ఆమె నిరాకరించడంతో ఆమె స్థానంలో భూమి పడ్నేకర్‌ను ఎంచుకున్నారు.
 
వాస్తవానికి ప్రియాంకా చోప్రా పలు హాలీవుడ్ చిత్రాలతోపాటు టీవీ సిరీస్‌లో బిజీగా ఉంది. పైగా అమెరికా సింగర్ నిక్ జోనస్‌తో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. వీరిద్దరికి వచ్చే నవంబరు నెలలో వివాహం జరుగనుంది. 
 
అయితే, బాలీవుడ్‌లో ఆమెకు రెండు చిత్రాల్లో ఆఫర్ వచ్చింది. అందులో ఒకటి భారత్ కాగా, మరొకటి సెల్యూట్. అయితే, భారత్ చిత్రం షూటింగ్‌లో పాల్గొని, ఆ తర్వాత అర్థాంతరంగా తప్పుకుంది. ఇక సెల్యూట్ విషయంలోనూ అదే జరిగింది. 
 
ఇదిలావుంటే, షారూక్ ఖాన్ నటించే వ్యోమగామి రాకేశ్‌శర్మ బయోపిక్ చిత్రంలో భూమి పడ్నేకర్‌కు చోటు కల్పించారు. ఈ చిత్రంలో కేవలం రాకేశ్‌శర్మ ప్రొఫెషనల్ లైఫ్‌ని మాత్రమేకాకుండా భార్యతో ఆయనకున్న అటాచ్‌మెంట్‌ను కూడా చర్చించనున్నారట. దాంతో హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉండనుంది.