మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (13:21 IST)

అమ్మే ఆ పని చేస్తుంది.. బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయమంటుంది..?

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే.. బాలీవుడ్‌లో తనకు ఎదురైన సంఘటన గురించి నోరు విప్పిన సంగతి తెలిసిందే. మీ టూ హ్యాష్‌టాగ్‌పై బాలీవుడ్ హీరోయిన్లు ఎందుకు స్పందించరని రాధికా ఆప్టే ప్రశ్నించిన గంటల్లోనే.. హీ

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే.. బాలీవుడ్‌లో తనకు ఎదురైన సంఘటన గురించి నోరు విప్పిన సంగతి తెలిసిందే. మీ టూ హ్యాష్‌టాగ్‌పై బాలీవుడ్ హీరోయిన్లు ఎందుకు స్పందించరని రాధికా ఆప్టే ప్రశ్నించిన గంటల్లోనే.. హీరోయిన్ భూమి పడ్నేకర్ సీన్లోకి వచ్చింది.


బాలీవుడ్‌లో భూమి నటించింది మూడంటే మూడు సినిమాలే అయినా.. బోల్డ్ కామెంట్స్ చేయడంలో భూమి ముందుంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తన జీవితంలో ప్రేమకి చోటు లేదని చెప్పిన భూమి శృంగారానికి మాత్రం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తానని చెప్పింది.
 
ప్రముఖ ఆంగ్ల పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన భూమి.. ప్రేమ, పెళ్లి, సెక్స్ అనే విషయాలపై స్పందించింది. తాను సినిమాలతో బిజీగా వున్నాను. అందువల్లే ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. ప్రస్తుతానికైతే పెళ్లి ఆలోచన లేదు. ప్రేమించే ఉద్దేశం అంతకంటే లేదు.
 
ప్రస్తుతం ప్రాజెక్టులపై మనసు పెట్టాను. బిజీగా ఉన్న కారణంగా అఫైర్లు పెట్టుకునే సమయం కూడా లేదు. జీవితంలో ప్రేమకి చోటు లేకపోయినా.. సెక్స్ జీవితానికి మాత్రం చోటుంది. తానెప్పుడూ బిజీగా వుండటంతో తన తల్లి స్వయంగా బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయమని ఎంకరేజ్ చేస్తుంటుంది. ఆమె స్వయంగా వారి వద్దకు పంపిస్తుంది. అందుకని తన సెక్స్ జీవితం బహిరంగం కాదని చెప్పింది.