గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (17:02 IST)

నా మాటల్ని నమ్మలేవా.. నీకు ఆ అధికారం ఎవరిచ్చారు.. కంగనా ఫైర్

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌పై మరో హీరోయిన్ కంగనా రనౌత్ మండిపడింది. క్వీన్ దర్శకుడు వికాస్ బెహెల్ తనను వేధింపులకు గురిచేశాడంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై సోనమ్ కపూర్ స్పందించింది.

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌పై మరో హీరోయిన్ కంగనా రనౌత్ మండిపడింది. క్వీన్ దర్శకుడు వికాస్ బెహెల్ తనను వేధింపులకు గురిచేశాడంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై సోనమ్ కపూర్ స్పందించింది. కంగనా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడం కష్టమని చెప్పింది.


అయినా తనకు జరిగిన వేధింపుల గురించి ధైర్యంగా బయటపెట్టడం అభినందించదగిన విషయమని.. ఈ విషయంలో కంగనను తాను గౌరవిస్తున్నానని తెలిపింది. కానీ సోనమ్ కపూర్ వ్యాఖ్యలపై కంగన ఫైర్ అయ్యింది. కొందరు మహిళలను మాత్రమే నమ్మాలనే లైసెన్స్ ఆమెకు ఎవరిచ్చారు. 
 
తాను చెప్పేవి తప్పని ఆమె ఎలా చెప్పగలుగుతుందని ఎదురుప్రశ్న వేసింది. తన తండ్రి వల్ల తనకు పేరు రాలేదని, ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని చెప్పింది. సోనమ్ కపూర్ గొప్ప నటేమి కాదని, గొప్పగా మాట్లాడుతుందన్న పేరు కూడా లేదని విమర్శించింది.

ఇలాంటి సినీ సెలబ్రిటీలకు తన గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారని కంగనా రనౌత్ అడిగింది. వారిని అణచివేస్తానని కంగన హెచ్చరించింది.
 
కాగా.. 2014లో క్వీన్ దర్శకుడు వికాస్ బెహెల్‌తో కలిసి సినిమా చేస్తున్నప్పుడు.. సెట్స్‌లో ఏదో తేడా కనిపించిందని కంగనా తెలిపింది. తామిద్దరం కలిసినప్పుడల్లా.. ఆప్యాయంగా పలకరించడం కోసం ఒకరినొకరం హత్తుకునే వాళ్లం. కానీ అతడు తన మెడలోకి తలదూర్చి తనను గట్టిగా హత్తుకుని నలిపేసేవాడని.. కంగనా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.