బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 7 అక్టోబరు 2018 (17:08 IST)

విష్ కోసం హగ్ చేసుకునే వాడు.. కానీ గట్టిగా నలిపేవాడు.. కంగనా రనౌత్

హాలీవుడ్ మీ టూ ప్రభావం బాలీవుడ్‌పై బాగానే పడింది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు నానా పటేకర్‌పై తనుశ్రీ వేధింపుల బండారం బయటపెట్టింది. ఈమెకు ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంల

హాలీవుడ్ మీ టూ ప్రభావం బాలీవుడ్‌పై బాగానే పడింది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు నానా పటేకర్‌పై తనుశ్రీ వేధింపుల బండారం బయటపెట్టింది. ఈమెకు ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంలో హీరో హృతిక్ రోషన్‌పై కామెంట్లు చేసి వార్తల్లో నిలిచిన కంగనా రనౌత్.. తాజాగా ''క్వీన్'' దర్శకుడు వికాస్ బెహెల్‌పై సంచలన కామెంట్స్ చేసింది. 
 
వికాస్ తనను వేధించాడని కంగనా కామెంట్లు చేసింది. ఇటీవల ఓ యువతి వికాస్ తనను వేధింపులకు గురిచేశాడంటూ మీడియా ముందు కామెంట్స్ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన కంగనా రనౌత్.. వికాశ్ అలాంటి వాడేనని స్పష్టం చేసింది. అంతేగాకుండా తనకు అతడితో ఏర్పడిన వేధింపుల గురించి కూడా చెప్పుకొచ్చింది.
 
''క్వీన్'' సినిమా షూటింగ్ సమయంలో వికాశ్ తనను ఎప్పుడు కలుసుకున్నా విష్ చేస్తున్నట్లుగా హగ్ చేసుకునేవాడు. కానీ అతడు తనను గట్టిగా పట్టుకొని నలిపేవాడని కంగనా తెలిపింది. ఈ విషయం ఎవరికీ తెలియదు. దాంతో వదిలించుకోవాలని చాలా ప్రయత్నించేదానినని కంగనా చెప్పింది. తన మెడపై అతని ముఖం పెట్టి.. తన కేశాల్లో వచ్చే స్మెల్‌ను పీల్చేవాడని.. హగ్ పూర్తయ్యాక.. జుట్టుకు వేసే కాస్మటిక్స్ గురించి అడుగుతూ.. ఆ వాసన తనకు నచ్చిందని చెప్పేవాడని కంగనా తెలిపింది. 
 
కాగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన ''క్వీన్'' సినిమా రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. భారీ రికార్డులతో ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్న క్వీన్ సినిమా డైరక్టర్ పాడు బుద్ధిని గురించి కంగనా చెప్పడం సంచలనంగా మారింది.
 
వికాశ్‌కి పెళ్లైనప్పటికీ పరాయి మహిళలతో సంబంధాలు పెట్టుకునేవాడు. ప్రేమ, పెళ్లి విషయాల్లో ఇతరుల అలవాట్లను తాను తప్పుబట్టను కానీ ఆ అలవాట్లు వ్యసనంగా మారినప్పుడు బయటకి చెప్పడంలో తప్పు లేదు. అతడు రోజూ రాత్రిళ్లు పార్టీలను వెళ్లేవాడు. తాను షూటింగ్ అయిన తరువాత హోటల్‌కి వెళ్లి నిద్రపోయేదాన్ని. దీంతో తనను అందరి ముందు ఎగతాళిగా మాట్లాడేవాడని వికాశ్‌పై కంగనా మండిపడింది.