1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Manikarnika Official Teaser

పదునైన కత్తులు చేతబట్టి.. రౌద్రంతో ఊగిపోతున్న "మణికర్ణిక"

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "మణికర్ణిక - ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ". వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం కానుక

Manikarnika Official Teaser
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "మణికర్ణిక - ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ". వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.
 
భారీ బ‌డ్జెట్‌తో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కాగా, కొంత ప్యాచ్ వ‌ర్క్ ఇటీవ‌ల పూర్తి చేశారు. వీటికి కంగ‌నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. అయితే చిత్ర టీజ‌ర్ కోసం అభిమానులు ఎప్ప‌టి నుండో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. 
 
నిజానికి ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన విడుద‌లవుతుందని భావించినప్ప‌టికి ప‌లు కార‌ణాల వల్ల వాయిదా వేశారు. అక్టోబ‌రు 2వ తేదీన గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. రౌద్రంతో ఊగిపోతు పదునైన కత్తులతో శత్రువులపై ఆమె పోరాడే తీరు ఎలా ఉంటుందో కంగన చెప్పకనే చెప్పారని తెలిపారు. 
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సింగర్ బాల భాస్కర్ ఇకలేరు.. శోక‌సంద్రంలో కుటుంబం