మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (11:03 IST)

ప్రేక్షకులు లిప్ లాక్ ఉండే చిత్రాలే కోరుకుంటున్నారు : దిల్ రాజు

నేటితరం సినీ ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అంటున్నారు. ఈ కారణంగా లిప్ లాక్స్, ఎక్స్‌పోజింగ్ అధికంగా ఉండే చిత్రాలనే వారు అమితంగా ఇష్టపడుతూ థియేటర్లకు క్యూ కడుతున్నార

నేటితరం సినీ ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అంటున్నారు. ఈ కారణంగా లిప్ లాక్స్, ఎక్స్‌పోజింగ్ అధికంగా ఉండే చిత్రాలనే వారు అమితంగా ఇష్టపడుతూ థియేటర్లకు క్యూ కడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
 
నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో దిల్ రాజు అంటే సక్సెస్. ఆయన పట్టిందల్లా బంగారమే. అంటే.. ఇండస్ట్రీకి వరుస హిట్లు అందించిన నిర్మాత. జడ్జిమెంట్ అంటే రాజుదే అనేలా పేరు తెచ్చుకున్నారు. కానీ, ఈ మధ్యకాలంలో వచ్చిన 'లవర్స్, శ్రీనివాస కళ్యాణం' రెండూ భాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాలుగా నిలిచాయి. 
 
ఈ నేపథ్యంలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన 'హుషారు' సినిమా వేడుకకు హాజరయ్యారు దిల్ రాజు. ఈ వేడుకలో మాట్లాడిన ఆయన ప్రేక్షకులు ఈ మధ్య మంచి, చెడుల గురించి ఆలోచించట్లేదు. సినిమా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా లేదా అనేదే చూస్తున్నారు. వాళ్లకు లిప్ లాక్స్ ఉండాలి. అదే రైట్ ఏమో. నేను కూడ భవిష్యత్తులో ఇలాంటి సినిమాలే చేయాల్సి వస్తుందేమో అన్నారు. దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.