హ‌రీష్ శంక‌ర్‌కి దిల్ రాజుకి చెడిందా..?

గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఆ త‌ర్వాత రామ‌య్యా వ‌స్తావ‌య్యా, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాలు చేసాడు. కానీ.. ఆశించిన స్థాయిలో స‌క్స‌స్ సాధించ‌లేదు. అయితే.. త‌దుప‌రి చిత్రాన్ని క

dil raju
srinivas| Last Modified శనివారం, 11 ఆగస్టు 2018 (19:27 IST)
గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఆ త‌ర్వాత రామ‌య్యా వ‌స్తావ‌య్యా, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాలు చేసాడు. కానీ.. ఆశించిన స్థాయిలో స‌క్స‌స్ సాధించ‌లేదు. అయితే.. త‌దుప‌రి చిత్రాన్ని కూడా దిల్ రాజు బ్యాన‌ర్ లోనే చేయ‌నున్నాడు. దీనికి దాగుడుమూతలు అనే టైటిల్ ఖ‌రారు చేసారు. నితిన్ - శ‌ర్వానంద్ హీరోలుగా న‌టించ‌నున్నార‌ని టాక్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ సినిమా సెట్స్ పైన ఉండాలి కానీ... అలా జ‌ర‌గ‌లేదు.
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే...హ‌రీష్ శంక‌ర్ చెప్పిన క‌థ దిల్ రాజుకి న‌చ్చ‌లేద‌ట‌. అందుచేత దిల్ రాజు హ‌రీష్ శంక‌ర్‌తో సినిమా చేసేందుకు నో చెప్పాడ‌ట‌. దీంతో హ‌రీష్ శంక‌ర్ వేరే బ్యాన‌ర్లో సినిమా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. 14 రీల్స్ బ్యాన‌ర్లో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం 14 రీల్స్ బ్యాన‌ర్లో వ‌రుణ్ తేజ్ హీరోగా సాగ‌ర చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నారు. మ‌రి.. హ‌రీష్ శంక‌ర్‌తో సినిమా చేసేందుకు ఎస్ అంటారో నో అంటారో చూడాలి.దీనిపై మరింత చదవండి :