శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (11:16 IST)

క్రిష్‌ పేరెత్తితే మండిపడుతున్న బాలీవుడ్ నటి.. ఎందుకంటే..

తెలుగులోని అగ్ర దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. ఈయన బాలకృష్ణ హీరోగా "గౌతమీపుత్ర శాతకర్ణి" వంటి హిస్టారికల్ మూవీని తెరకెక్కించారు. దీంతో ఆయనకు బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక

తెలుగులోని అగ్ర దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. ఈయన బాలకృష్ణ హీరోగా "గౌతమీపుత్ర శాతకర్ణి" వంటి హిస్టారికల్ మూవీని తెరకెక్కించారు. దీంతో ఆయనకు బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని "మణికర్ణిక" అనే చిత్రానికి దర్శకత్వం వహించే భాగ్యం దక్కింది.
 
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా చాలా మేరకు పూర్తయింది. ఈ పరిస్థితుల్లో "ఎన్టీఆర్ బయోపిక్‌"కు క్రిష్ దర్శకుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 'మణికర్ణిక' గురించి క్రిష్ పూర్తిగా మరిచిపోయారు. క్రిష్ పూర్తిగా తన దృష్టినంతటినీ కేవలం 'ఎన్టీఆర్ బయోపిక్‌'పైనే కేంద్రీకరించారు. దీంతో కంగనాకు కోపమొచ్చింది. 
 
క్రిష్ కోసం ఇంకా వేచిచూడటం వల్ల ప్రయోజనం లేదని కంగనా భావించింది. అందుకే స్వయంగా దర్శకత్వ బాధ్యతలను భుజానికెత్తుకుంది. సహ రచయితలు, దర్శకత్వ విభాగం సహాయంతో మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. మొదలుపెట్టిన సినిమాను ఎలాగైనా పూర్తి చేయడం కోసం కంగనా తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ నిజంగా అభినందనీయం.