మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: సోమవారం, 20 ఆగస్టు 2018 (19:57 IST)

కొచ్చిలో చిక్కుకున్న మారుతి... టెన్ష‌న్‌లో టీమ్..!

డైరెక్ట‌ర్ మారుతి కేర‌ళ‌లోని కొచ్చిలో చిక్కుకున్నారు. అక్క‌డ‌కి ఎందుకు వెళ్లారంటారా..? శైల‌జారెడ్డి అల్లుడు సినిమాకి గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. గోపీ సుంద‌ర్ మ‌ల‌యాళీ. ఆయ‌న కొచ్చిలోనే ఉంటారు. రెండుమూడు రోజులు రీ-రికార్డింగ్ బాగానే జ‌రిగింద‌ట‌

డైరెక్ట‌ర్ మారుతి కేర‌ళ‌లోని కొచ్చిలో చిక్కుకున్నారు. అక్క‌డ‌కి ఎందుకు వెళ్లారంటారా..? శైల‌జారెడ్డి అల్లుడు సినిమాకి గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. గోపీ సుంద‌ర్ మ‌ల‌యాళీ. ఆయ‌న కొచ్చిలోనే ఉంటారు. రెండుమూడు రోజులు రీ-రికార్డింగ్ బాగానే జ‌రిగింద‌ట‌. ఆ త‌ర్వాత అక్క‌డ క‌రెంట్ కూడా లేక‌పోవ‌డంతో వ‌ర్క్ ఆగింది. మ‌రోవైపు గోపీ సుంద‌ర్ బంధువులు కొంతమంది వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నారు. వారి కోసం గోపీ సుంద‌ర్ టెన్ష‌న్ ప‌డ‌టం వ‌ల‌న వ‌ర్క్‌కి బ్రేక్ ప‌డింది. 
 
ఇంకా ఆరు రీళ్లకి రీ-రికార్డింగ్ చేయాలి. ఏం చేయాలో తెలియ‌డం లేద‌ట‌. హైద‌రాబాద్‌లో ఎవ‌రితోనైనా రీ-రికార్డింగ్ చేయించాలా..? లేక గోపీ సుంద‌ర్‌ని హైద‌రాబాద్ తీసుకురావాలా..? తెలియ‌క తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మారుతి ఈరోజో రేపో హైద‌రాబాద్ వ‌చ్చేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ట‌. మ‌రి... గోపీ సుంద‌రే ఆ ఆరు రీళ్ల‌కి రీ-రికార్డింగ్ అందిస్తాడో..? లేక వేరే మ్యూజిక్ డైరెక్ట‌ర్ అందిస్తాడో చూడాలి.