శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (16:47 IST)

'జర్నీ' హీరోయిన్‌కు వరద కష్టాలు.. ఇల్లు మునిగిపోయింది...

దేవ భూమిగా పేరుగాంచిన కేరళ ఇపుడు వరద నీటిలోవుంది. సామాన్యుడు మొదలుకుని సెలెబ్రిటీ వరకు వరద నీటి కష్టాల్లో కూరుకునివున్నారు. ఈ రాష్ట్రంలోని 14 జిల్లాలు వరద నీటిలో ఉన్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న

దేవ భూమిగా పేరుగాంచిన కేరళ ఇపుడు వరద నీటిలోవుంది. సామాన్యుడు మొదలుకుని సెలెబ్రిటీ వరకు వరద నీటి కష్టాల్లో కూరుకునివున్నారు. ఈ రాష్ట్రంలోని 14 జిల్లాలు వరద నీటిలో ఉన్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైన విషయం తెల్సిందే.
 
ఈ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల వల్ల భారీ వరదలు సంభవించాయి. వీటితో సుమారు 300లకు పైగా వరద బాధితులు మృత్యువాతపడ్డారు. అలాగే, తిన‌డానికి తిండి, తాగ‌డానికి నీళ్లు లేక సామాన్యులు ఇబ్బందిప‌డుతున్నారు. సామ‌న్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌ారు. 
 
తాజాగా 'జర్నీ' చిత్ర హీరోయిన్ అన‌న్య ఇల్లు కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిందట. ఇదే అంశంపై ఆమె ఓ వీడియోను విడుదల చేసింది.  తమ ఇల్లు పూర్తిగా మునిగిపోవ‌డంతో న‌టి ఆశా శ‌ర‌త్ ఇంట్లో త‌ల‌దాచుకుంటున్న‌ట్టు వెల్ల‌డించింది.
 
'మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. నిమిషాల వ్య‌వ‌ధిలోనే నీటిమ‌ట్టం పెరిగిపోతోంది. ఇప్ప‌టికీ వ‌ర్షం కురుస్తోంది. మా స‌న్నిహితులు, బంధువుల ఇళ్లు కూడా మునిగిపోయాయి. శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు మా ఇంట్లో ఉండ‌గ‌లిగాం. ఇప్పుడు న‌టి ఆశా శ‌ర‌త్ ఇంట్లో త‌ల దాచుకుంటున్నాం. జీవితంలో ఎన్న‌డూలేని విధంగా గ‌త రెండ్రోజులుగా చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన పరిస్థితుల‌ను ఎదుర్కొన్నాను. మాకు స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్న‌వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు' అంటూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను అనన్య పోస్ట్ చేసింది.