బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (12:46 IST)

ఉడుతను పట్టుకునేందుకు ఆరుగురు ఎలా తిప్పలు పడ్డారో చూడండి (Video)

ఒక ఉడుతను పట్టుకునేందుకు ఆరుగురు సహాయక సిబ్బంది నానా తిప్పలు పడ్డారు. ఏకంగా కొన్ని గంటల పాటు శ్రమించి చివరకు ఆ ఉడుతను పట్టుకుని రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చ

ఒక ఉడుతను పట్టుకునేందుకు ఆరుగురు సహాయక సిబ్బంది నానా తిప్పలు పడ్డారు. ఏకంగా కొన్ని గంటల పాటు శ్రమించి చివరకు ఆ ఉడుతను పట్టుకుని రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.  
 
లండన్‌లోని ఎన్‌ఫీల్డ్ పట్టణంలో ఓ ఉడుత పేపర్ కప్‌లో ఉన్న పదార్థాన్ని తినడానికి ప్రయత్నించింది. అయితే, ఆ ఉడుత మూతి అందులో ఇరుక్కుపోయింది. దీంతో కాసేపు ఉడుత ఇబ్బందులు పడింది. ఎన్‌ఫీల్డ్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సిబ్బంది తక్షణమే స్పందించి.. ఉడుత ప్రాణాలను కాపాడేందుకు యత్నించారు. 
 
ఆ ఉడుతను పట్టుకునేందుకు ఆరుగురు సిబ్బంది శ్రమించారు. మొత్తానికి ఉడుతను పట్టుకుని.. దాని ముఖానికి ఉన్న పేపర్ కప్‌ను తొలగించారు. దీంతో ఉడుత గంతేస్తూ పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.