మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (18:12 IST)

ప్రజలకు సేవ చేయాలంటే.. రాజకీయాల్లోకి రానవసరం లేదు: కంగనా రనౌత్

ముక్కుసూటిగా మాట్లాడే నటీమణుల్లో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముందుంటుంది. తాజాగా ప్రజలకు సెలబ్రిటీలు సేవ చేయాలని కామెంట్ చేసింది. ప్రజలకు సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని కంగనా ర

ముక్కుసూటిగా మాట్లాడే నటీమణుల్లో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముందుంటుంది. తాజాగా ప్రజలకు సెలబ్రిటీలు సేవ చేయాలని కామెంట్ చేసింది. ప్రజలకు సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని కంగనా రనౌత్ స్పష్టం చేసింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో ఐదేళ్ల అవకాశం ఇవ్వాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కంగనా రనౌత్.. ప్రజా సేవ పట్ల సెలబ్రిటీలకు వున్న ఆలోచన గురించి వెల్లడించింది. 
 
దేశంలోని కొందరు నటులు తమకు కరెంట్, నీటి కొరత లేవని, అలాంటప్పుడు ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడాన్ని కంగనా తప్పుబట్టింది. సినీనటులు ప్రజా సమస్యలపై నోరు విప్పకపోతే వారు సాధించిన విజయాలకు అర్థం ఉండదని స్పష్టం చేసింది.
 
దేశంలో స్టార్ డమ్ ఉన్న మమ్మల్ని కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు ఎగబడుతుంటారు. అలాంటి తారలు సామాజిక సమస్యలపై మాట్లాడకపోతే వారు సాధించిన స్టార్ డమ్‌కు అర్థం ఉండదు. సెలెబ్రిటీలు కరెంట్, నీటి కష్టాలు లేకపోయే సరికి ప్రజల కష్టాలను పట్టించుకోరని.. స్టార్ డమ్ ఇచ్చింది ప్రజలనే విషయాన్ని వారు గుర్తించుకోవట్లేదని కంగనా ఆవేదన వ్యక్తం చేసింది.