శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (09:32 IST)

వివాదాల కోసమే పుట్టాను.. అది నా విధిరాత : రాఖీ సావంత్

బాలీవుడ్ నటి రాఖీ సావంత్. ఏ పని చేసినా.. ఏం మాట్లాడినా అది వివాదం కావాల్సిందే. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నాయి.

బాలీవుడ్ నటి రాఖీ సావంత్. ఏ పని చేసినా.. ఏం మాట్లాడినా అది వివాదం కావాల్సిందే. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నాయి.
 
ఛండీగఢ్‌లోని జీరఖ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రాఖీ.. తన క్యారెక్టర్‌పై స్పందిస్తూ, 'వివాదాల్లో ఉండటం నాకిష్టం ఉండదు. దీనిని ఎవరు ఇష్టపడతారు? కానీ నా విధిరాత అలానే ఉంది. జనమంతా నేను వివాదాల కోసమే పుట్టాననుకుంటారు. ఇప్పుడు నేనే స్వయంగా చెబుతున్నాను. నేను వివాదాల కోసమే పుట్టాను' వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా రాఖీ... సన్నీలియోన్ ప్రస్తావనరాగా, నాకు, ఆమెకు ఎంతో తేడా ఉంది. ఆమె గురించి నేనేం మాట్లాడలేనన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదనే ఉందని, పెళ్లి గురించి ఆలోచించడం లేదన్నారు. అయితే పంజాబీ యువకులు ఎంతో అందంగా ఉంటారు. వారిలో ఎవరైనా దొరికితే బాగుంటుందనిపిస్తోందని రాఖీ తెలిపారు.