శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (13:19 IST)

అతనితో అలా పిలిపించుకోవడం చాలా ఇష్టంగా ఉంది : కత్రినా కైఫ్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్. వీరిద్దరూ కలిసి చాలా సంవత్సరాల తర్వాత "భారత్" అనే భారీ ప్రాజెక్టులో నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల తార ప్రియాంక

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్. వీరిద్దరూ కలిసి చాలా సంవత్సరాల తర్వాత "భారత్" అనే భారీ ప్రాజెక్టులో నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల తార ప్రియాంకా చోప్రాను ఎంపిక చేశారు. కానీ, ఆమె విదేశీ సింగర్ నిక్ జోనాస్‌ను వివాహమాడనున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఫలితంగా ఆమె స్థానంలో కత్రినా కైఫ్‌ను తీసుకున్నారు.
 
గత యేడాది సల్మాన్‌ ఖాన్‌కు జంటగా అలీ దర్శకత్వంలో కట్రీనా 'టైగర్‌ జిందాహై' సినిమా వచ్చింది. తాజాగా ఇదే కాంబినేషన్‌లో 'భారత్' సినిమా తెరకెక్కుతోంది. ఏడేళ్లగా కట్రీనాతో మంచి స్నేహం, అనుబంధం ఉన్న అలీ అబ్బాస్‌ కత్రినాను రకరకాల ముద్దుపేర్లతో పిలుస్తాడట. 
 
'భారత్' సినిమా సెట్లో ఆమెకు గోల్డ్‌ ఫిష్‌ అనే పేరుపెట్టి ఆ పేరుతోనే పిలుస్తున్నారట. కట్రీనా పనితీరు నచ్చి ఆ పేరుతో పిలుస్తున్నారా లేక ఏడేళ్లగా వారిద్దరి మధ్య ఉన్న స్నేహంతో పిలుస్తున్నారా అన్న ప్రశ్నకు క్యాట్‌ జవాబు చెప్పలేదు. "గోల్డ్‌ ఫిష్" పేరు చాలా స్వీట్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది. అలీ అలా ఎందుకు పిలుస్తున్నారో నాకు తెలీదు. కానీ ఆ పేరుతో పిలిపించుకోవడం చాలా బావుంది అని కత్రినా కైఫ్ వ్యాఖ్యానించింది.