గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జులై 2018 (11:04 IST)

శ్రీరెడ్డి ఇక ఆపు.. అంతా నీ సమ్మతంతోనే జరిగాయ్.. సూది దారి ఇవ్వడంతోనే?

కోలీవుడ్ ప్రముఖులు మురుగదాస్, రాఘవ లారెన్స్, శ్రీకాంత్, సుందర్ సిలపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి, ప్రస్తుతం యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి గురించి, క్య

కోలీవుడ్ ప్రముఖులు మురుగదాస్, రాఘవ లారెన్స్, శ్రీకాంత్, సుందర్ సిలపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి, ప్రస్తుతం యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి మీ అభిప్రాయం ఏమిటని మీడియా ఎవరిని పడితే వారిని ప్రశ్నిస్తోంది. దీంతో సీనియర్ నటి, నిర్మాత అయిన లక్ష్మీ రామకృష్ణన్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. 
 
అందుకు ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. శ్రీరెడ్డి గురించి తాను మాట్లాడనని స్పష్టం చేసింది. సాధారణ మహిళకు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే చాలామంది పట్టించుకోలేదని.. అదే ఓ నటికి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం ఎంతగా జోక్యం చేసుకుంటున్నారని అడిగారు.
 
మరోవైపు టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపణలు చేసి కలకలం రేపిన నటి శ్రీరెడ్డి... పలువురు కోలీవుడ్ ప్రముఖులపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మురుగదాస్, సుందర్, నటుడు శ్రీరామ్, లారెన్స్ తదితరులు అవకాశాలు ఇస్తామంటూ ఆశ చూపి, తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో పలువురు కోలీవుడ్ ప్రముఖులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తాజాగా ప్రముఖ దర్శకుడు భారతీరాజా శ్రీరెడ్డిపై విరుచుకుపడ్డారు. శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయని... అయినప్పటికీ, వాటితో ప్రచారం పొందాలని శ్రీరెడ్డి అనుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పారు. ఎవరో మోసం చేశారని సినిమావారందరినీ శ్రీరెడ్డి తప్పుపట్టడం సరికాదన్నారు. ఎదుటివారిపై బురదచల్లే కార్యక్రమాన్ని ఇప్పటికైనా ఆపేయాలని సూచించారు. శ్రీరెడ్డి సమ్మతించకపోతే ఇవన్నీ జరిగివుండేవి కావని, సూది దారి ఇవ్వడంతోనే కదా నూలు లోపలికి వెళ్తుందని భారతీ రాజా అన్నారు.