సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (18:06 IST)

త్రిషను చూస్తే కుళ్ళుగా అనిపించింది.. శ్రీరెడ్డి ఎవరండీ బాబూ.. స్టార్ని చేయొద్దు (video)

టాలీవుడ్‌లో ఎవరూ పట్టించుకోకపోవడంతో శ్రీరెడ్డి తమిళ్ లీక్స్ మొదలెట్టి చెన్నై వెళ్ళిపోయింది. ప్రస్తుతం అక్కడి మీడియాలో హడావిడి చేస్తుంది. ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోకి రావటానిక

టాలీవుడ్‌లో ఎవరూ పట్టించుకోకపోవడంతో శ్రీరెడ్డి తమిళ్ లీక్స్ మొదలెట్టి చెన్నై వెళ్ళిపోయింది. ప్రస్తుతం అక్కడి మీడియాలో హడావిడి చేస్తుంది. ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోకి రావటానికి స్ఫూర్తి ఎవరు అనే ప్రశ్నకు శ్రీరెడ్డి త్రిష అని సమాధానం ఇచ్చింది. అది కూడా తన ఎక్స్‌బాయ్ ఫ్రెండ్ వలనేనని చెప్పింది. 
 
తాను తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో పబ్‌కు వెళ్తే.. అదే పబ్‌లో రానా, త్రిష డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. త్రిషని చూసిన తన బాయ్‌ఫ్రెండ్ చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. త్రిష చాలా బాగుంది కదా.. ఎంత క్యూట్‌గా ఉందో అంటూ పొగుడుతున్నాడు.
 
అలా త్రిషని పొగుడుతుంటే తనకు కుళ్ళుగా అనిపించింది. అదే తాను హీరోయిన్ కావడానికి కారణమని, తాను హీరోయిన్ అయితే తనను కూడా అలానే అబ్బాయిలు ఊహించుకుంటారు.. అనుకుని సినిమాల్లోకి వచ్చానని శ్రీరెడ్డి చెప్పింది. అందుకే హీరోయిన్ కోసం తన శరీరాకృతిని మార్చుకున్నాను. కానీ ఆఫర్లు కోసం తప్పుడు పనులు చేయాల్సొచ్చిందని శ్రీరెడ్డి తెలిపింది. 
 
అయితే తమిళ లీక్స్ పేరిట త్రిష పేరును శ్రీరెడ్డి పలికింది. దీనిపై త్రిష స్పందిస్తూ.. శ్రీరెడ్డి కామెంట్స్ గురించి తనను అడగవద్దని చెప్పింది. అలా ఆమెను సెలెబ్రిటీని చేసేయవద్దని ఝలక్ ఇచ్చింది. అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని త్రిష స్పష్టం చేసింది. అనవసరంగా ఆమె గురించి మాట్లాడటం ఎందుకు..? ఆమెను పెద్దమనిషిని చేయడం ఎందుకని తిరుగు ప్రశ్న వేసింది. 
 
ఇక సీనియర్ నటీమణులు ప్రస్తుతం శ్రీరెడ్డి గురించి కామెంట్ చేస్తున్నారు. ముందు మనకంటూ ఓ హద్దును నిర్ణయించుకోవాలి. అలాంటప్పుడు ఎవ్వరూ మన వద్దకు రాలేరు. క్రమశిక్షణతో కూడిన వారితో జర్నీ చేస్తే ఏ బాధా వుండదు. ఇలాంటి మోసాలు జరగవని శ్రీరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు.