బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 21 జులై 2018 (13:48 IST)

దానిమ్మ రసంలో కాస్త పెరుగును కలిపి ముఖానికి రాసుకుంటే...

దానిమ్మను ఆహారంలో భాగంగా ప్రతిరోజూ తీసుకుంటాం. శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్స్ ఈ దానిమ్మలో ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్నే కాదు అందాల పోషణలోను బాగా పనిచేస్తాయి. దానిమ్మ చర్మానికి గల ఒత్తిడిని తగ్గించి, న

దానిమ్మను ఆహారంలో భాగంగా ప్రతిరోజూ తీసుకుంటాం. శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్స్ ఈ దానిమ్మలో ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్నే కాదు అందాల పోషణలోను బాగా పనిచేస్తాయి. దానిమ్మ చర్మానికి గల ఒత్తిడిని తగ్గించి, నిస్తేజంగా ఉండకుండా చేయడంలో సహాయపడుతుంది. దానిమ్మపండు గింజలను కొన్ని నీళ్లు పోసో బాగా గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా కాంతివంతంగా వెురుస్తుంది. నల్లని మచ్చలు తొలిగించేందుకు దానిమ్మ గింజల్ని పేస్ట్‌‍లా చేసుకోవాలి. ఇందులో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువచ్చని నీటితో కడుక్కోవాలి.
 
ఇలా వారానికి ఒకసారి చేయడం వలన నల్లని మచ్చలు తొలిగిపోతాయి. దానిమ్మ గింజలను పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా తేనెను, నిమ్మరసాన్ని కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
చర్మం సహజమైన తేమను కలిగేందుకు దానిమ్మలో ఉండే హైడ్రేటింగ్ ఏజెంట్ బాగా సహాయపడుతుంది. దానిమ్మ రసంలో ఓట్‌మీల్ పౌడర్‌ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో తేనె, గుడ్డ పచ్చసొనను కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. పొడి చర్మాన్ని నివారించి సహజ తేమను తీసుకొస్తుంది.