శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (15:13 IST)

మాజీ ప్రియుడు కోసం కాదు... ఆయన కోసం సమ్మతించా...

కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం భారత్. ఈ ప్రాజెక్టు నుంచి ప్రియాంకా చోప్రా తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు కత్రికా కైఫ్‌ను ఎంపిక చేశారు. మాజీ ప్రియుడు సల్మాన్ కోసమే కత

కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం భారత్. ఈ ప్రాజెక్టు నుంచి ప్రియాంకా చోప్రా తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు కత్రికా కైఫ్‌ను ఎంపిక చేశారు. మాజీ ప్రియుడు సల్మాన్ కోసమే కత్రినాను ఎంపిక చేసినట్టు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
 
దీనిపై కత్రికా కైఫ్ స్పందిస్తూ, 'దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ నాకు చాలా అంటే చాలా సన్నిహిత మిత్రుడు. తనతో రెండు సినిమాలు చేశా. ఒకరోజు తను ఫోన్‌ చేసి స్క్రిప్ట్‌ మెయిల్‌ చేశా. చదివి నీ నిర్ణయం చెప్పు' అని కోరాడు. కథ నచ్చింది. అందులో నా పాత్ర ఎగ్జయిటింగ్‌గా ఉంది. దాంతో అలీ అబ్బాస్‌ జాఫర్‌ కోసం సినిమా అంగీకరించా' అని కత్రినా కైఫ్ వివరణ ఇచ్చింది. 
 
ఈ వ్యాఖ్యలు మరో చర్చకు దారితీశాయి. 'సల్మాన్‌ పేరుని మాట వరసకైనా చెప్పలేదేంటి?' అనే కొత్త చర్చ మొదలైంది. కత్రినా కెరీర్‌ ప్రారంభంలో సల్మాన్‌ ఎంత సహాయం చేశాడో అందరికీ తెలుసు. కండల వీరుడి అండ లేకుంటే ఆమె ఈస్థానానికి వచ్చేవారు కాదనే మాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది.