మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 మే 2018 (14:50 IST)

డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప.. ఇదే 'శ్రీనివాస కళ్యాణం' స్టోరీ

ఈ కాలంలో డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప అని చాటిచెప్పడమే "శ్రీనివాస కళ్యాణం" కథ అని సినీ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. నితిన్ - రాశిఖన్నా జంటగా 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం.

ఈ కాలంలో డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప అని చాటిచెప్పడమే "శ్రీనివాస కళ్యాణం" కథ అని సినీ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. నితిన్ - రాశిఖన్నా జంటగా 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా, సతీశ్ వేగేశ్న దర్శకుడు.
 
ఈ చిత్రం స్టోరీపై నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ, డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్పవని చాటి చెప్పడమే ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందని చెప్పారు. 'ఆర్థికపరమైన సంబంధాలకే ఎక్కువగా విలువనిచ్చే ప్రకాశ్ రాజ్, ఒక తెలుగింటి పెళ్లికి అతిథిగా వస్తాడట. అనుబంధాలు.. ఆత్మీయతలు.. మానవ సంబంధాల్లోని గొప్పతనం ఆయనకి అక్కడే అర్థమవుతుందట. ఆయనకి కనువిప్పు కలిగించడమే ధ్యేయంగా ఈ కథ నడుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
గతంలో కూడా దిల్ రాజు వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్‌లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో కూడా కుటుంబ బంధాన్ని అద్భుతంగా చూపించిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు.