శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 మే 2018 (16:00 IST)

క్రికెటర్ భార్య గర్భస్రావానికి బాల్ ట్యాంపరింగ్‌కు లింకేంటి?

ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్పడిన బాల్ ట్యాంపరింగ్ వివాదం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అంతేనా, పలువురు క్రికెటర్ల జీవితంలో ఇది మాయని మచ్చగా మారింది. ఇంకొందరు క్రికెటర్ల జీవితాల్లో విషాదం నింపి

ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్పడిన బాల్ ట్యాంపరింగ్ వివాదం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అంతేనా, పలువురు క్రికెటర్ల జీవితంలో ఇది మాయని మచ్చగా మారింది. ఇంకొందరు క్రికెటర్ల జీవితాల్లో విషాదం నింపింది.


బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన క్రికెటర్లపై క్రికెట్ అభిమానులు చేసిన విమర్శలు, అసభ్యపదజాల దూషణలను తట్టుకోలేక ఓ క్రికెటర్ భార్యకు గర్భస్రావమైంది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. ఆస్ట్రేలియా మాజీ ఉపసారథి డేవిడ్ వార్నర్. ఈయనకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
 
బాల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని తట్టుకోలేని ఆసీస్ అభిమానులు వార్నర్ భార్య క్యాండీస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసభ్య పదజాలంతో దూషించారు. అప్పటికే గర్భవతిగా ఉన్న క్యాండీస్ అభిమానుల విమర్శలు, వ్యక్తిగత దూషణల కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనైంది. దీనికి తోడు క్రికెట్ ఆస్ట్రేలియా పిలుపుతో సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఆస్ట్రేలియా చేరుకోవాల్సి రావడం.. తదితర కారణాల వల్ల క్యాండీస్‌కు గర్భస్రావమైంది.
 
బుడతడు వార్నర్ వస్తాడనుకుని మురిసిపోతున్న వేళ ఇలా జరగడాన్ని వార్నర్ దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాండీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. అభిమానుల సూటిపోటి మాటలు, ప్రయాణం కారణంగా ఆ ఒత్తిడి కడుపులోని తన బిడ్డకు పడుతుందేమోనని అనుకున్నానని, భయపడినట్టే జరిగిందని కన్నీరు పెట్టుకుంది. గర్భస్రావం తమ ఇంట విషాదాన్ని నింపిందని, తట్టుకోలేక ఇద్దరం ఏడ్చేశామని క్యాండీస్ వివరించింది.