సోమవారం, 30 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (14:29 IST)

స్టీవ్ స్మిత్‌పై యేడాది నిషేధం? రూ.కోట్లలో నష్టం

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఒక యేడాది నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన తన జట్టు సహచరులకు మద్దతు తెలిపినందుకుగాను స్మిత్‌పై ఈ నిషే

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఒక యేడాది నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన తన జట్టు సహచరులకు మద్దతు తెలిపినందుకుగాను స్మిత్‌పై ఈ నిషేధాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయనుంది. 
 
ఈ నిషేధం విధించడం వల్ల స్మిత్ భారీగా నష్టపోనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా చెల్లించే మ్యాచ్‌ ఫీజుల రూపంలో మొత్తం సుమారు 19.71 కోట్ల రూపాయలను స్మిత్ వేతనంగా అందుకుంటున్నాడు. నిషేధం అమలైతే ఈ మొత్తాన్ని కోల్పోనున్నాడు. 
 
అలాగే, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ అందించనున్న 12 కోట్ల రూపాయలతో పాటు, శామ్‌‌సంగ్‌, న్యూబాలెన్స్‌ తదితర ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా పొందే రెమ్యూనరేషన్‌ను కోల్పోనున్నాడు. 
 
నిజానికి స్మిత్ ఒక్కో టెస్టుకు 14,000 డాలర్లు, ఒక్కో వన్డేకు 7,000 డాలర్లు, ఒక్కో టీ20కి 5,000 డాలర్ల వేతనాన్ని స్మిత్ సీఏ నుంచి అందుకుంటున్నాడు. ఒక యేడాది పాటు స్మిత్ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తే 13 టెస్టులు, 24 వన్డేలు, 5 టీ20లకు అందుబాటులో ఉండడు. అలాగే, పలు సంస్థలు స్మిత్‌తో ఉన్న వాణిజ్య ఒప్పందాలను కూడా రద్దు చేసుకునే అవకాశం ఉంది.