ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (12:44 IST)

బ్యాంకులకు ఐదు రోజులు సెలవా? అదేం లేదు.. శనివారం బ్యాంకులు పనిచేస్తాయ్!

బ్యాంకులు ఐదురోజుల పాటు పనిచేయవు. ఈ వారం గురువారం నుంచి సోమవారం నరకు సెలవులని బ్యాంకులు ప్రకటించాయి. ఏవైనా అత్యవసర ఆర్థిక లావాదేవీలుంటే బుధవారంలోపు చూసుకోవాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

బ్యాంకులు ఐదురోజుల పాటు పనిచేయవు. ఈ వారం గురువారం నుంచి సోమవారం నరకు సెలవులని బ్యాంకులు ప్రకటించాయి. ఏవైనా అత్యవసర ఆర్థిక లావాదేవీలుంటే బుధవారంలోపు చూసుకోవాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్పందిస్తూ.. ఐదు రోజులు బ్యాంకులు పనిచేయవనే వార్తలు అవాస్తవమని, మహావీర్ జయంతి సందర్భంగా గురువారం ఆపై గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బ్యాంకులకు సెలవన్నారు. 
 
కానీ శనివారం నాడు బ్యాంకులకు ఈ నెలలో ఐదో శనివారం కాబట్టి పని చేస్తాయని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య జనరల్‌ సెక్రటరీ థామస్‌ ఫ్రాంకో రాజేంద్ర దేవ్‌ మీడియాతో స్పష్టం చేశారు. ఆదివారం ఎలాగో బ్యాంకులకు సెలవు కాబట్టి.. ఏప్రిల్ 2వ తేదీ మాత్రం బ్యాంకులు పనిచేస్తాయా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. అందుచేత ఈ వారం గురు, శుక్రవారాలు బ్యాంకులు పనిచేయవని బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే ఏప్రిల్ రెండో తేదీ యాన్వల్ క్లోజింగ్ కోసం బ్యాంకులు పనిచేయవని సమాచారం.