1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Facebook asks new users to enter names 'as per Aadhaar' while signing up

ఫేస్‌బుక్ ఖాతా తెరవాలంటే ఆధార్ తప్పనిసరి కానుందా?

ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువును 2018, మార్చి 31వ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 2017, డిసెంబర్‌ 31 వరకు ఉన్న ఈ గడువును మరో మూడు నెలలు పెంచినట్లు కేంద్రం వెల్లడి

Facebook
ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువును 2018, మార్చి 31వ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 2017, డిసెంబర్‌ 31 వరకు ఉన్న ఈ గడువును మరో మూడు నెలలు పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ సేవలు, పథకాలు పొందడానికి ఆధార్‌ తప్పనిసరి అంటూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. ప్రజల సౌకర్యార్థం ఆ గడువును మార్చి 31వ తేదీ వరకు ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాలకు, ఫోన్ నెంబర్లకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు..  ఈ విధానాన్ని సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్‌కు కూడా అంటగట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఫేస్ బుక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే రీతిలో సిద్ధంగా వుంది. త్వ‌ర‌లో ఫేస్‌బుక్ ఖాతా సృష్టించుకోవాలంటే ఆధార్‌లో ఉన్న పేరును ఉప‌యోగించేలా ఆ సంస్థ చ‌ర్య‌లు తీసుకోబోతోంది. 
 
త‌ప్పుడు పేర్ల‌తో అకౌంట్లు తెరిచి, మోసాల‌కు పాల్ప‌డుతున్న వారిని నియంత్రించేందుకే ఈ పద్ధతిని ఫేస్‌బుక్ కూడా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ ఈ విధానాన్ని ఆప్షనల్‌గా ఉంచాలని.. ఆధార్ కార్డులోని పేరును మాత్రమే ఎఫ్‌బీ ఖాతా తెరిచేందుకు ఉపయోగించేలా వుంటుందని తెలుస్తోంది. 
About Writer
selvi
తర్వాతి కథనం
పాపను చూసేందుకు ఆదివారం ఇంటికొచ్చి ఇబ్బంది పెట్టేవాడు: వనితా రెడ్డి