శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (21:21 IST)

ట్వట్టర్‌లో సరికొత్త ఫీచర్... ఫేస్‌బుక్‌కు ధీటుగా...

ట్విట్టర్ యూజర్లకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదీ కూడా ఫేస్‌బుక్‌కు ధీటుగా దీన్ని రూపొందించారు. ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్ తరహాలో కొత్తగా మూమెంట్స్ అనే ఫీచర్ వచ్చింది.

ట్విట్టర్ యూజర్లకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదీ కూడా ఫేస్‌బుక్‌కు ధీటుగా దీన్ని రూపొందించారు. ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్ తరహాలో కొత్తగా మూమెంట్స్ అనే ఫీచర్ వచ్చింది. యూజర్లకు చెందిన ట్విట్టర్ అకౌంట్లలో హోమ్, నోటిఫికేషన్స్ ట్యాబ్‌ల వద్ద ఈ ఫీచర్‌ను ఒక కొత్త ట్యాబ్‌లో అందిస్తున్నారు. మూమెంట్స్ ట్యాబ్‌ను ఓపెన్ చేస్తే అందులో ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్ తరహాలో ట్వీట్లు కనిపిస్తాయి. 
 
ఇందులో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్న లేదా యూజర్ లొకేషన్ సెట్టింగ్స్‌కు అనుగుణంగా ట్రెండ్ అవుతున్న 'మూమెంట్స్ ట్వీట్లు' స‌ద‌రు మూమెంట్స్ ట్యాబ్‌లో ఇకనుంచి కనిపించనున్నాయి. యూజర్లు తాము ఫాలో అయ్యే ట్విట్టర్ అకౌంట్లతో సంబంధం లేకుండా ఆయా ట్వీట్లు ట్రెండింగ్‌కు అనుగుణంగా కనిపిస్తాయి. 
 
వాటిల్లో తమకు నచ్చిన ట్వీట్లకు యూజర్లు లైక్ కొట్టవచ్చు. అందుకు హార్ట్ సింబల్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ట్వీట్లను అవసరం అనుకుంటే రీట్వీట్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ మూమెంట్స్ ఫీచర్ భారత్‌లో ట్విట్టర్‌ను వాడే యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.