మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 14 డిశెంబరు 2017 (21:43 IST)

ఫ్రెష్ అకౌంట్ ఓపెన్ చేసిన రోజా... ఎందుకు?

వై.ఎస్.ఆర్.సి.సి. ఎమ్మెల్యే, నటి రోజా ఏది చేసినా అది సంచలనమే. ఇప్పటివరకు ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తన ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ.. తానేమి చేస్తున్నానన్న విషయాన్ని అభిమానులకు చెబుతుంటారు రోజా. అయితే కొత్తగా ట్విట్టర్లో రోజా ఒక అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ట్వి

వై.ఎస్.ఆర్.సి.సి. ఎమ్మెల్యే, నటి రోజా ఏది చేసినా అది సంచలనమే. ఇప్పటివరకు ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తన ఫోటోలను అప్‌లోడ్  చేస్తూ.. తానేమి చేస్తున్నానన్న విషయాన్ని అభిమానులకు చెబుతుంటారు రోజా. అయితే కొత్తగా ట్విట్టర్లో రోజా ఒక అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ట్విట్టర్‌లో రోజా మొదటి అకౌంట్ ఇది. ఎంతో ఆనందంగా కనిపించే ఫోటోను అకౌంట్లో జత చేశారు. 
 
రోజా అకౌంట్ ఓపెన్ చేయగానే అందులో హల్లో.. వైఎస్ ఆర్ కుటుంబం.. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు వెనువెంటనే చాలామంది స్పందించారు. బాగున్నారా రోజా గారు అంటూ సందేశాలు పంపారు. ట్విట్టర్లో ఒక మెసేజ్‌కే ఇలా స్పందించడంతో రోజా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ట్విట్టర్లో సందేశాలు, ఫోటోలు పంపాలని నిర్ణయానికి వచ్చేశారు రోజా. మరి ఎంతమంది ఫాలోయర్లు ఫాలో అవుతారో చూడాలి.