1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ttd vigilance officer running behind MLA Roja, Why

తిరుమలలో రోజా వెంటపడ్డ టిటిడి విజిలెన్స్ అధికారి.. ఎందుకు?

తిరుమలలో నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి పడ్డాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం బయటకు వచ్చిన రోజా, తన కారు ఎక్కేంతవరకు కూడా ఆ విజిలెన్స్ అధికారి వెంటపడ్డాడు. రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి వెంట పడటం చూసిన

ttd vigilance officer
తిరుమలలో నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి పడ్డాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం బయటకు వచ్చిన రోజా, తన కారు ఎక్కేంతవరకు కూడా ఆ విజిలెన్స్ అధికారి వెంటపడ్డాడు. రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి వెంట పడటం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
 
అయితే ఆ అధికారి రోజాను తిరుమల మాడవీధుల్లో మాట్లాడనీయకుండా ఉండేందుకు వెంటపడినట్లు మీడియా ప్రతినిధులు తరువాత గుర్తించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో రోజా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని గతంలో టిటిడి ఉన్నతాధికారులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. దీంతో టిటిడి విజిలెన్స్ అధికారులు రోజాకు ఆ విషయాన్ని చెప్పేందుకు ఆమె వెంట పడ్డాడు. 
 
చివరకు ఆలయం ముందు రోజా మాట్లాడుతుండగా... మేడం మాట్లాడొద్దు అంటూ చెప్పే ప్రయత్నం విజిలెన్స్ అధికారి చేసినా ఆమె మాత్రం మాట్లాడుతూనే ఉండిపోయారు. చివరకు చేసేదేమీ లేక ఆ విజిలెన్స్ అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
About Writer
TJ
తర్వాతి కథనం
రీనాక్ పర్వతాన్ని అధిరోహించి విద్యార్థినీవిద్యార్థులు: అభినందించిన మంత్రి నక్కా