బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2017 (17:56 IST)

ఇకపై శ్రీవారి ప్రసాదం చేదు... ఎందుకంటే?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం ఇకపై తీపికి బదులు చేదుగా మారనుంది. దీనికి కారణం లేకపోలేదు. శ్రీవారి ప్రసాదాలైన లడ్డూ, వడ, తదితర ప్రసాదాల ధరలను పెంచేందుకు తిరుమల తిరుపతి దే

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం ఇకపై తీపికి బదులు చేదుగా మారనుంది. దీనికి కారణం లేకపోలేదు. శ్రీవారి ప్రసాదాలైన లడ్డూ, వడ, తదితర ప్రసాదాల ధరలను పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం శ్రీవారి కల్యాణోత్సవాలు, ఆలయాల కుంభాబిషేకాలు, ఇతరాత్రా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విజ్ఙాపనలపై టీటీడీ లడ్డూ, వడ ప్రసాదాలను విక్రయిస్తుంది. వీటి ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుని ధరలను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. 
 
ఇందులోభాగంగా, సాధారణ లడ్డూను 25రూ నుంచి 50 రూపాయలకు, శ్రీవారి కల్యాణం లడ్డూ ధరను రూ 100 నుంచి 200కు గాను, వడ రూ 25 నుంచి 50రూపాయలకు గాను, మినీ లడ్డూను రూ 3.50 నుంచి 7రూపాయలకు పెంచారు. 
 
సిపార్సులపై ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని కూడా పెంచాలని టీటీడీ భావిస్తోంది. అలాగే, సిఫార్సు లేకపోయినప్పటికీ సాధారణ భక్తులకు కూడా కోరినన్ని నడ్డూలను ఇవ్వాలని తితిదే భావిస్తోంది.