శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2017 (11:50 IST)

శ్రీవారి సేవలో చెర్రీ - ఉపాసన... కొణిదెల వారింట శుభవార్త?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఆయన సతీమణి, అపోలో ఆస్పత్రి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ఉపాసనలు సోమవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఆయన సతీమణి, అపోలో ఆస్పత్రి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ఉపాసనలు సోమవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నైవేద్య విరామ సమయంలో సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
 
స్వామివారి దర్శనార్ధం కోసం ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న చెర్రీ దంపతులకు టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెర్రీ వ్యాఖ్యానించారు