1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2017 (11:06 IST)

శ్రీవారి ఆలయం ఎదుట పందుల సంచారం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు పందులు సంచరించాయి. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో వరాహాల మంది తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి తమ ఇష్టానుసారం పరుగులు పెడుతుంటే, టీటీడీ అధికారులు గమనించ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు పందులు సంచరించాయి. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో వరాహాల మంది తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి తమ ఇష్టానుసారం పరుగులు పెడుతుంటే, టీటీడీ అధికారులు గమనించకపోవడం భక్తులు విస్తుపోయేలా చేసింది. ఏడు పందుల మంద ఒకటి బేడీ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి మెట్లు దిగి కిందకు వచ్చి, ఆయన మందు వరకూ వెళ్లి, అక్కడి నుంచి దక్షిణ మాడవీధిలోకి పరుగులు పెట్టాయి. 
 
అత్యంత పవిత్రంగా భావించే తిరుమాడ వీధుల్లో ఇవి తిరగడం భక్తులందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా భక్తులను ఇక్కడ చెప్పులతో తిరగనివ్వరు. అలాంటి చోట పందులు తిరగడంపై అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. టీటీడీ నిఘా విభాగం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. బేడీ ఆంజయనేయ స్వామి ఆలయం ముందు నుంచి దక్షిణ మాడ వీధుల్లోకి వచ్చినట్టు చెబుతున్నారు భక్తులు. తిరుమలలో పందులను నియంత్రించాలని గతంలో ఈఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం.