1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YCP MLA Roja Padayatra to Compete with Ys Jagan

నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కి.మీటర్లు.. రోజా పాదయాత్ర

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారుపై ఒత్తిడి తెచ్చే దిశగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రను చేపట్టారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తాను సైతం అంటూ మరో పాదయాత్రకు సిద్ధ

YCP MLA Roja
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారుపై ఒత్తిడి తెచ్చే దిశగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రను చేపట్టారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తాను సైతం అంటూ మరో పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో దిట్ట అయిన రోజా ప్రజా సమస్యలపై నోరెత్తారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టారు. 
 
ప్రస్తుతం రోజా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇందుకు గాను గాలేరు-నగరి ప్రాజెక్టును వేదికగా చేసుకున్నారు. తిరుమలకు పాదయాత్ర చేయనున్నారు. ఈనెల 28వతేదీ నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా పాదయాత్ర ప్రారంభం కానుంది. గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రోజా ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు వైకాపా వర్గాలు వెల్లడించాయి. 
 
నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్లు రోజా పాదయాత్ర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
తర్వాతి కథనం
12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష