శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (10:58 IST)

జగన్ సీఎం కావాలని యువకుడి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి...

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈనాటికి తొమ్మిదో రోజుకు చేరింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ''ప్రజా సంకల్ప యాత్ర" వైఎస్

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈనాటికి తొమ్మిదో రోజుకు చేరింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ''ప్రజా సంకల్ప యాత్ర" వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా రాజుపాలెం మండలం టంగుటూరుకు చెందిన కాచన శ్రీనివాసులురెడ్డి వైసీపీ చీఫ్ జగన్‌కు వీరాభిమాని. ఇతడు సోమవారం టంగుటూరు మెట్ట వద్ద జగన్ నిర్వహించిన పాదయాత్రలో శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నాడు. 
 
రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఉదయం జగన్ సీఎం కావాలని సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి మృతితో రాజుపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

పలువురు నేతలు అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా కడప జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.