సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (08:45 IST)

చిరు ఫ్లెక్సీ ముందు వీరాభిమాని పెళ్లి... దంపతులకు 'మెగా' సర్‌ప్రైజ్

తమకు నచ్చిన హీరోల కోసం అభిమానులు ప్రాణత్యాగానికైనా వెనుకాడరు. అలాగే, తమ జీవితంలో జరిగే అరుదైన మధుర ఘట్టాలను సైతం వారి కటౌట్లు, ఫ్లెక్సీల ముందుపెట్టి జరుపుకుంటుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా జరిగింది.

తమకు నచ్చిన హీరోల కోసం అభిమానులు ప్రాణత్యాగానికైనా వెనుకాడరు. అలాగే, తమ జీవితంలో జరిగే అరుదైన మధుర ఘట్టాలను సైతం వారి కటౌట్లు, ఫ్లెక్సీల ముందుపెట్టి జరుపుకుంటుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా జరిగింది. 
 
ఇటీవల ఈస్ట్ గోదావరి జిల్లా కడియాపు అనే గ్రామానికి చెందిన ఆకుల భాస్కరరావు అనే చిరు వీరాభిమాని మెగాస్టార్ చిరంజీవి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, దాని ముందు కూర్చుని తన వివాహాన్ని చేసుకున్నాడు. ఈ విషయం సామాజికమాధ్యమాల్లో వైరల్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ వీరాభిమాని దంపతులకు చిరంజీవి మెగా సర్‌ప్రైజ్ ఇచ్చారు. 
 
ఆ నూతన దంపతులను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించి.. వారితో కలసి భోజనం చేశారు. అంతేకాదు, నవదంపతులకు కొత్త దుస్తులను కానుకగా ఇచ్చి ఆశీర్వదించారు. తాను అభిమానించే నటుడే స్వయంగా తమను ఆహ్వానించి.. విందు ఇవ్వడంతో ఆ వీరాభిమాని ఆనందానికి హద్దులు లేవు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరాయి.