శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (16:24 IST)

సమంత సినిమాల్లో కనిపించేది ఇక రెండేళ్లే.. తర్వాత ఫ్యామిలీ లైఫ్‌లోకి...?

చెన్నై బ్యూటీ సమంత.. అక్కినేని వారింటి కోడలైంది. ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసి.. ఆ సినిమా హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే పెళ్లికి తర్వాత ఆమె నటిస్తానని క్లార

చెన్నై బ్యూటీ సమంత.. అక్కినేని వారింటి కోడలైంది. ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసి.. ఆ సినిమా హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే పెళ్లికి తర్వాత ఆమె నటిస్తానని క్లారిటీ ఇచ్చినా.. ప్రస్తుతం ఓ కొత్త వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో షికార్లు చేస్తోంది. సమంత ఇంచుమించు మరో రెండేళ్లు మాత్రమే సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా కనిపిస్తుందని.. ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకుంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుండగానే.. చైతూను పెళ్లాడిన సమంత.. పెళ్లికి తర్వాత కూడా నటించవచ్చునని అక్కినేని ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పెళ్లి తరువాత సమంత ఎంతకాలం హీరోయిన్‌గా కొనసాగుతుందనే విషయంలో మాత్రం ఎవరికీ అంతగా స్పష్టత లేదు. ప్రస్తుతం చేతిలో వున్న సినిమాలన్నీ పూర్తయ్యాక సమంత మెయిన్ హీరోయిన్‌గా సినిమాలు ఒప్పుకుంటుందా అనే ప్రశ్న తలెత్తింది. 
 
సమంత కూడా మరో రెండేళ్లు నటించాక.. ఫ్యామిలీ లైఫ్‌లోకి పూర్తిస్థాయిలో ఎంటరవ్వాలని నిర్ణయించుకుందని సమాచారం. మరి ఈ వార్తలపై సమంత ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుందో లేదో అనేది వేచిచూడాలి.