శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (12:52 IST)

మార్చి 29న రంగస్థలం రిలీజ్..?

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న రంగస్థలం 1985 సినిమా సంక్రాంతికి వచ్చేది లేదని సమాచారం. ఈ చిత్రాన్ని మార్చి 29వ తేదీన విడుదల చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్ల

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న రంగస్థలం 1985 సినిమా సంక్రాంతికి వచ్చేది లేదని సమాచారం. ఈ చిత్రాన్ని మార్చి 29వ తేదీన విడుదల చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన ఈ సినిమా టీమ్, హైదరాబాద్‌లో వేసిన విలేజ్ సెట్‌లో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేశారు. 
 
అయితే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంతా కథానాయికగా నటిస్తుండగా, స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే కనువిందు చేయనుంది. రంగస్థలం 1985 కోసం సుకుమార్ చాలా కష్టపడుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆ ఫోటోలో రంగస్థలం అనేది ఊరిపేరని స్పష్టంగా చూపించాడు.