శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (15:55 IST)

ప్రభాస్‌తో ఛాన్సొస్తే వదిలిపెట్టేది లేదంటున్న విశాల్ ప్రేయసి వరలక్ష్మి...

''బాహుబలి'' సినిమాతో సినీ ఐకాన్‌గా మారిపోయాడు. సాహో చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న యంగ్ రెబల్ స్టార్‌తో నటించే అవకాశం కోసం వరలక్ష్మి ఎదురుచూస్తోంది. ప్రభాస్‌తో కలిసి నటించాలని అందరూ అనుకుంటారు. ఆ అవకాశ

''బాహుబలి'' సినిమాతో సినీ ఐకాన్‌గా మారిపోయాడు. సాహో చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న యంగ్ రెబల్ స్టార్‌తో నటించే అవకాశం కోసం వరలక్ష్మి ఎదురుచూస్తోంది. ప్రభాస్‌తో కలిసి నటించాలని అందరూ అనుకుంటారు. ఆ అవకాశం వస్తే ఏ హీరోయిన్‌ మాత్రం వదులుకుంటుందని చెప్పింది.

బాహుబలి సినిమాలో ప్రభాస్‌ నటన సూపర్బ్‌. తనకు చాలా బాగా నచ్చిందని వెల్లడించింది. తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ వంటి టాలెంట్‌ ఉన్న నటులున్నారు. వారితోనూ సినిమాలు చేయాలనుందని సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయ, విశాల్ ప్రేయసిగా చెప్పబడుతున్న వరలక్ష్మి వెల్లడించింది.  
 
బాహుబలికి తర్వాత ప్రభాస్ బాలీవుడ్‌తో పాటు పలు భాషలకు చెందిన సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రభాస్‌తో ఒక్క సినిమాలోనైనా నటింప చేయాలనే సినీ నిర్మాతలు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ నుంచి వెల్లువలా ఆఫర్లు వచ్చి పడ్డాయి. అయినా ప్రభాస్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.