సంబంధిత వార్తలు
- ఆ దర్శకుడి 'దమ్ము'పై రూ. 300 కోట్లు పెట్టనున్న దిల్ రాజు...?
- రూ.2713 కోట్లకు పెరిగిన ఎస్సీ కార్పోరేషన్ బడ్జెట్... జూపూడి, ఇన్నోవాలు ఇస్తున్నారు...
- ఫ్లాప్ టాక్... అయినా రూ.150 కోట్లు కొల్లగొట్టింది : 'స్పైడర్' నిర్మాత
- అసలు పేరు స్వీటీ.. అనుష్క అనే పేరు ఎలా పెట్టుకున్నానంటే?: దేవసేన
- అబ్బా.. మళ్లీ అనుష్కతో స్నేహమేనంటున్న ప్రభాస్..
''భాగమతి''కి తప్పని బరువు ఎఫెక్ట్.. దేవసేన కోసం రూ.5కోట్లు ఖర్చు?
భాగమతిలోనూ అనుష్క బరువు నిర్మాతలకు కష్టం తెచ్చిపెట్టిందట. బాహుబలిలో దేవసేనను నాజూగ్గా చూపించేందుకు రాజమౌళి నిర్మాతలను ఖర్చుపెట్టమన్నట్లు.. భాగమతిలో నాజూకుగా చూపించడానికి గ్రాఫిక్స్ సాయం తీసుకున్నారు.
బాహుబలిలో దేవసేనగా మెప్పించిన అనుష్క.. ఆ సినిమా తర్వాత భాగమతిలో నటిస్తున్న సంగతి తెలిసిదే. ఈ సినిమా నవంబరులో రిలీజ్ కానుందని సమాచారం. యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తయ్యాయి. టెక్నికల్ పనులు కూడా దాదాపు పూర్తయినట్టే. ''పిల్ల జమిందార్'' దర్శకుడు అశోక్.జి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్లను ముందుగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో భాగమతిలోనూ అనుష్క బరువు నిర్మాతలకు కష్టం తెచ్చిపెట్టిందట. బాహుబలిలో దేవసేనను నాజూగ్గా చూపించేందుకు రాజమౌళి నిర్మాతలను ఖర్చుపెట్టమన్నట్లు.. భాగమతిలో నాజూకుగా చూపించడానికి గ్రాఫిక్స్ సాయం తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం బరువు తగ్గాలనుకున్న అనుష్క తరం కాలేదని టాక్.
సైజ్ జీరో కోసం బరువు పెరిగిన అనుష్క ఆపై బరువు తగ్గేందుకు విశ్వప్రయత్నాలు చేసిందని.. అయినా యోగా టీచర్ వల్ల కాలేదని సమాచారం. దీంతో అనుష్క బరువు ఎఫెక్ట్ భాగమతిపై కూడా పడిందట. దాంతో ఆమెను కొంత నాజూకుగా చూపించడానికి గ్రాఫిక్స్ సాయాన్ని తీసుకుంటున్నారట. ఇందుకోసం అదనంగా మరో 5 కోట్లను ఖర్చు చేస్తున్నట్టుగా ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
