బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: సోమవారం, 16 అక్టోబరు 2017 (19:44 IST)

ఆ దర్శకుడి 'దమ్ము'పై రూ. 300 కోట్లు పెట్టనున్న దిల్ రాజు...?

దిల్ రాజు నిర్మాతగా త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న భారతీయుడు-2 సినిమాకు ఇప్పుడు ఎంత బడ్జెట్ పెట్టనున్నారన్నదే హాట్ టాపిక్. సంచలనాల దర్శకుడు, దక్షిణాది హీరో కమల్ హాసన్ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు చెప్పనవసరం లేదు. శంకర్ డబ్బుల విషయంలో ఎక్కడా కాం

దిల్ రాజు నిర్మాతగా త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న భారతీయుడు-2 సినిమాకు ఇప్పుడు ఎంత బడ్జెట్ పెట్టనున్నారన్నదే హాట్ టాపిక్. సంచలనాల దర్శకుడు, దక్షిణాది హీరో కమల్ హాసన్ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు చెప్పనవసరం లేదు. శంకర్ డబ్బుల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అస్సలు కాడనే టాక్ వుంది. కోట్లకు కోట్లు డబ్బులు కుమ్మరించాల్సిన పరిస్థితి నిర్మాతకు ఏర్పడుతుంది. కానీ డబ్బుల విషయంలో మాత్రం దిల్ రాజు వెనక్కితగ్గరనేది సినీ పరిశ్రమలోని వారు చెప్పే మాటలు.
 
ఇది నిజమే.. సినిమాకు భారీగానే డబ్బులు వస్తాయంటే ఇక దిల్ రాజు ఏ మాత్రం ఆలోచించరు. మొదటగా 200 కోట్లు భారతీయుడు-2 సినిమాకు పెట్టాలని డైరెక్టర్ శంకర్ చెప్పారు. ఆ తరువాత ఇప్పుడు 300 కోట్లు అయ్యే అవకాశం ఉందని చెప్పారట. దిల్ రాజు మాత్రం ఎంతయినా ఫర్వాలేదు.. ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని శంకర్‌కు చెప్పారట. ఇప్పుడు ఎక్కడ చూసినా భారతీయుడు-2 సినిమా గురించే టాపిక్. 
 
దిల్ రాజు ఇంత మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టడానికి కూడా ఒక కారణం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. శంకర్ సినిమా అంటే ఖచ్చితంగా భారీ హిట్ సాధించి, పెట్టిన డబ్బు కన్నా ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకునే దిల్ రాజు ఇప్పుడు అంత మొత్తంలో ఖర్చు చేయనున్నారట.