మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 30 సెప్టెంబరు 2017 (17:50 IST)

దిల్ రాజు నిర్మాతగా 'భారతీయుడు 2', శంకర్ దర్శకత్వంలో...

మరో సంచలన చిత్రాన్ని దిల్ రాజు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విలక్షణ నటుడు కమలహాసన్ నటించిన 'భారతీయుడు' సినిమా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్.. భారతీయుడు 2 చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రా

మరో సంచలన చిత్రాన్ని దిల్ రాజు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విలక్షణ నటుడు కమలహాసన్ నటించిన 'భారతీయుడు' సినిమా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్.. భారతీయుడు 2 చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ప్రస్తుతం దీనికి సంబంధించిన కథను తమిళ దర్శకుడు శంకర్ ఏకంగా దిల్ రాజుకు వినిపించినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. శంకర్ చెప్పిన కథ నచ్చడంతో దిల్ రాజు చిత్రం తీసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రంలో కూడా హీరోగా కమల్ హాసన్ నటించనున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించనున్నారు.