శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (10:18 IST)

పడక గదికి వస్తే ఛాన్సిస్తానన్నారు : శ్రద్ధా దాస్ (Hot Video)

హీరో అల్లరి నరేష్ నటించిన చిత్రం 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం'. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన భామ శ్రద్ధా దాస్. గత దశాబ్దకాలంగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ భామ... తెలుగుతో పాటు అనేక భాషా చి

హీరో అల్లరి నరేష్ నటించిన చిత్రం 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం'. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన భామ శ్రద్ధా దాస్. గత దశాబ్దకాలంగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ భామ... తెలుగుతో పాటు అనేక భాషా చిత్రాల్లో నటిస్తూ కాలం వెళ్లదీస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో అవకాశాలు సన్నగిల్లినప్పటికీ హాట్ హాట్ ఫోజులతో మీడియా దృష్టిని బాగానే ఆకర్షిస్తోందని చెప్పొచ్చు.
 
ప్రస్తుతం తన కెరీర్‌పై ఆమె స్పందిస్తూ కెరియర్ ఆరంభంలో పడక గదికి వస్తే అవకాశం ఇస్తామనే వాళ్లు తనకి కూడా తారసపడ్డారని చెప్పింది. అయితే, అలాంటి అవకాశాల కోసం తాను దిగజారలేదనీ, ఫలితంగానే అనేక చిత్రాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయినట్టు తెలిపింది.
 
పడక గదికి రావాలంటూ సంప్రదించిన వారిలో అనేక మంది దర్శకనిర్మాతలు ఉన్నారనీ, అలా అడిగినందుకు తాను కొన్ని సినిమాల నుంచి తప్పుకున్న సందర్భాలు.. తాను చేసిన పాత్రల నిడివిని తగ్గించిన సందర్భాలు ఉన్నాయని అంది.
 
ఇలాంటివాటినన్నింటిని సహనంతో తట్టుకుని నిలబడ్డానే గానీ, ఏనాడూ అవకాశాల కోసం దిగజారలేదని స్పష్టం చేసింది. అదేసమయంలో తన గ్లామర్‌ను కాపాడుకుంటూ వస్తుండటం వల్లే ఇప్పటికీ అడపాదడపా అవకాశాలు వస్తున్నాయని శ్రద్ధా దాస్ చెప్పుకొచ్చింది.