శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 13 జులై 2017 (06:50 IST)

సినిమాలో కంటెంట్‌ ఉంటే వసూళ్లకు ఆకాశమే హద్దు.. బాహుబలి చెప్పింది ఇదే..

సినిమాలో కంటెంట్‌ ఉంటే ఆకాశమే హద్దుగా వసూళ్లు వస్తున్నాయి ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పారు. ఈ రెండేళ్లలో వచ్చిన సినిమాలు పరిశీలిస్తే... కొత్తవాళ్లతో రెండు కోట్లలో తీసిన సినిమా 20 కోట్లు వసూలు చేసింది. పదేళ్లుగా ఇల్లు–టీవీలకు అతుక్కుపోయిన ప్రే

సినిమాలో కంటెంట్‌ ఉంటే ఆకాశమే హద్దుగా వసూళ్లు వస్తున్నాయి ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పారు. ఈ రెండేళ్లలో వచ్చిన సినిమాలు పరిశీలిస్తే... కొత్తవాళ్లతో రెండు కోట్లలో తీసిన సినిమా 20 కోట్లు వసూలు చేసింది. పదేళ్లుగా ఇల్లు–టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులను ‘బాహుబలి’ థియేటర్లకు రప్పించింది. సినిమాలో కంటెంట్‌ ఉంటే ఆకాశమే హద్దుగా వసూళ్లు వస్తున్నాయి. హీరో స్లంపులో ఉన్నాడనేది మేటర్‌ కాదు. అదే... ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. బాగోకపోతే రెండో రోజు కూడా కలెక్షన్స్‌ ఉండవు అని సత్తారు కథకు ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పారు. 
 
‘‘కథను బట్టే బడ్జెట్‌ ఉంటుంది. ఈ సిన్మాను పాతిక కోట్లతో తీశామని... నా తర్వాతి సినిమాను అంత కంటే ఎక్కువ బడ్జెట్‌తో తీయాలనుకోను. కథకు రెండు కోట్లు చాలనుకుంటే... రెండు కోట్లలోనే తీస్తా’’ అన్నారు ప్రవీణ్‌ సత్తారు. రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎం. కోటేశ్వరరాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ సినిమా గురించి ప్రవీణ్‌ విశేషాలు పంచుకున్నారు.
 
జీవిత గారు ఓ రోజు ఫోన్‌ చేసి రాజశేఖర్‌గారికి ఏదైనా కథ ఉంటే చెప్పమన్నారు. హాలీవుడ్‌ హిట్‌ ‘డై హార్డ్‌’ టైప్‌ కథ చెప్పా. నేను తీసిన గత రెండు సినిమాలు ‘చందమామ కథలు, గుంటూరు టాకీస్‌’ కంటే డిఫరెంట్‌ జానర్‌ సిన్మా. భారీ స్కేల్‌ ఉన్న సిన్మా, భారీ బడ్జెట్‌ కావాలి. బహుశా... వేరే నిర్మాతలైతే అంతకు ముందు ఏం తీశావమ్మా అనడిగేవారేమో! ఎం. కోటేశ్వరరాజుగారు, హీరోగారు కథను, నన్ను నమ్మారు.
 
రాజశేఖర్‌గారి ‘మగాడు’ సినిమాకు, అందులో ఆయన యాక్టింగ్‌కి నేను పెద్ద ఫ్యాన్‌. ఇందులో ఆయనది అలాంటి క్యారెక్టరైజేషన్‌ ఉన్న పాత్రే. ‘నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ’ (ఎన్‌ఐఏ) ఆఫీసర్‌గా చేశారు. షూటింగ్‌ ఫినిష్‌ చేశాం. తాను తప్ప వేరేవాళ్లు చేయలేరన్నంతగా రాజశేఖర్‌గారు నటించారు. సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిన్మా ఇది. స్టోరీ, యాక్షన్‌ సీక్వెన్లు చాలా కొత్తగా ఉంటాయి అని ప్రవీణ్ సత్తారు సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
ఈ సినిమాకు ముందు రాజశేఖర్‌గారి మార్కెట్‌ ఎంతని ఆలోచించలేదు. సన్నీ లియోన్‌తో ఐటమ్‌ సాంగ్‌ చేయించాలనేది నిర్మాత ఐడియా. భీమ్స్‌ మంచి బీటున్న సాంగ్‌ చేశారు. ఆడియన్స్‌ను సన్నీ సాంగ్‌ బాగా ఎట్రాక్ట్‌ చేస్తుంది. బట్, రిలీజైన తర్వాత సిన్మాలో కంటెంట్‌ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకముంది. పూజాకుమార్, శ్రద్ధా దాస్, కిశోర్‌.. అద్భుతంగా నటించారు. తెలుగులో యాక్షన్‌ బేస్డ్‌ ఎంటర్‌టైనర్స్‌కు ‘పీఎస్వీ గరుడవేగ’ కొత్త టెంప్లేట్‌ అవుతుందనుకుంటున్నా.