మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

ఫ్లాప్ టాక్... అయినా రూ.150 కోట్లు కొల్లగొట్టింది : 'స్పైడర్' నిర్మాత

ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించి దీపావళికి రిలీజ్ అయిన చిత్రం "స్పైడర్". ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ను సొంతం చే

ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించి దీపావళికి రిలీజ్ అయిన చిత్రం "స్పైడర్". ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ, కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు కురిపిస్తోంది.
 
తాజాగా, చిత్రం 12 రోజుల పోస్టర్‌ను విడుదల చేసిన నిర్మాతలు తమ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సంపాదించిందని అధికారికంగా ప్రకటించింది. ఇంత భారీ కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన ప్రేక్షకులకు, మహేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు నిర్మాత 'ఠాగూర్' మధు వెల్లడించారు. 
 
కాగా, 'బాహుబలి' తర్వాత విదేశాల్లో అత్యధిక సెంటర్లలో 'స్పైడర్' విడుదలైన సంగతి తెలిసిందే. 11 రోజుల్లోనే ఈ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో 16 మిలియన్ డాలర్ల కలెక్షన్‍‌కు చిత్రం చేరుతుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 
 
మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' చిత్రం మాత్రం పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నప్పటికీ.. కలెక్షన్లపరంగా మాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఫలితంగా 'స్పైడర్‌' దసరా కింగ్‌గా నిలిచింది.