మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 7 అక్టోబరు 2017 (17:29 IST)

సమంత మెడలో చైతు మూడుముళ్లు... ఏడ్చేసిన జెస్సీ

పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ క్షణాలు ప్రతి ఆడపిల్లకు మధురమైనవి, ఉద్విగ్నమైనవి కూడాను. సమంత కూడా అలాంటి క్షణాలను కొద్దిసేపు అనుభవించింది. సమంత మెడలో నాగచైతన్య మూడుముళ్లు వేయగానే ఆనందభరితమైన హృదయంతో ఉద్విగ్నతకు లోనై కళ్లవెంట ఆనంద బాష్పాలు పెట్టుకుంది. ఆ సన్

పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ క్షణాలు ప్రతి ఆడపిల్లకు మధురమైనవి, ఉద్విగ్నమైనవి కూడాను. సమంత కూడా అలాంటి క్షణాలను కొద్దిసేపు అనుభవించింది. సమంత మెడలో నాగచైతన్య మూడుముళ్లు వేయగానే ఆనందభరితమైన హృదయంతో ఉద్విగ్నతకు లోనై కళ్లవెంట ఆనంద బాష్పాలు పెట్టుకుంది. ఆ సన్నివేశం చూసిన సమంత తరపు పెద్దలకు కూడా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. మెట్టినింటికి వెళ్లే ప్రతి పెళ్లికూతురు అనుభవించే స్థితే ఇది. 
 
ఇకపోతే సమంత - నాగచైతన్యల పెళ్లికి కేవలం ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీకి చెందినవారెవ్వరికీ ఆహ్వానాలు అందలేదు. ఐతేనేం నూతన వధూవరులకు సోషల్ మీడియా సాక్షిగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు. మనం కూడా చెప్పేద్దాం కొత్త జంటకు శుభాకాంక్షలు.